గబ్బెట నాని జయంతి సందర్భంగా అన్నదానం
- జనగామలో బైక్ దొంగల ముఠా గుట్టురట్టు - November 12, 2026
- విద్యార్థులతో కలిసి వాలీబాల్ ఆడిన కలెక్టర్.. ఘనంగా జిల్లా స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం - November 12, 2026
- ఆజాద్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలి:ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి - November 12, 2026

జనగామ: కీర్తిశేషులు గబ్బెట నాని జయంతిని పురస్కరించుకొని ఆయన తల్లిదండ్రులు గబ్బెట స్వాతి, శ్రీనివాస్ దంపతులు జనగామ జిల్లా ఏరియా ఆసుపత్రి వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చిన రోగులు, వారి సహాయకులకు భోజనం అందించి కుమారుడిని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంతెన మణికుమార్, ప్రధాన కార్యదర్శి వంగ భీమ్ రాజ్ మాట్లాడుతూ.. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం గొప్ప సేవ అని, ప్రతి ఒక్కరూ నిరుపేదలు, నిరాశ్రయులకు అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు కొయ్యడ రవి, బింగి నరసింహులు, ఎడవెల్లి బాబు, సిద్ధిరాల చందు, బొల్లం కనకరాజు, పిట్టల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
