లింగంపేట్ టీఆర్ఎస్లో ఇద్దరికి కీలక పదవులు
- లింగంపేట్ టీఆర్ఎస్లో ఇద్దరికి కీలక పదవులు - November 21, 2026
- పేదరికాన్ని జయించి హైకోర్టు న్యాయవాదిగా భూంపల్లి రవితేజ - November 21, 2026
- రైతుల ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం - November 21, 2026
లింగంపేట్ మండల టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఎల్లారెడ్డి నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఇద్దరు నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఐలాపూర్ గ్రామానికి చెందిన ఏనుగు సాయిలును లింగంపేట్ మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా, పోతాయిపల్లి గ్రామానికి చెందిన రాపర్తి మహేందర్‌ను మండల పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఈ నియామకాలను మండల అధ్యక్షుడు పోకల సాయిరాం వెల్లడించారు. ఈ సందర్భంగా రాపర్తి మహేందర్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు కమిటీ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, జిల్లా యువజన అధ్యక్షుడు జైల్ సింగ్, మండల యువజన అధ్యక్షుడు మోహన్ రెడ్డి, జిల్లా నాయకులు శ్రీకాంత్, బుర్ర కృష్ణ గౌడ్, మండల మహిళా అధ్యక్షురాలు సావిత్రి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు బ్యాగరి సాయిలు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
