ఎమ్మెల్యే వీరేశంపై విమర్శలు సహించేది లేదు : కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు పెద్ది సుక్కయ్య

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 21: ఎమ్మెల్యే వేముల వీరేశంపై మాజీ జడ్పీటీసీ, కాంగ్రెస్ నాయకుడు సుంకరబోయిన నర్సింహ్మ పదేపదే విమర్శలు చేస్తే సహించేది లేదని కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు పెద్ది సుక్కయ్య హెచ్చరించారు. పార్టీకి ఎవరు ద్రోహం చేశారో, గతంలో ఎన్నిసార్లు వెన్నుపోటు పొడిచారో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. కట్టంగూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం సర్పంచులు, పార్టీ సీనియర్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని, వ్యక్తిగత స్వార్థ రాజకీయాలకు తావివ్వడం లేదని స్పష్టం చేశారు. గత సర్పంచ్ ఎన్నికల్లో సమన్వయ కమిటీ నిర్ణయాలను పక్కనపెట్టి వ్యక్తిగత అభిప్రాయాలతో పార్టీ నాయకత్వంపై విమర్శలు చేయడం తగదన్నారు. గతంలో సుంకరబోయిన నర్సింహ్మ కాంగ్రెస్ బీఫామ్‌పై పోటీ చేసి, మరోసారి పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగి పార్టీ అభ్యర్థి ఓటమికి కారణమయ్యారని ఆరోపించారు. 2019లో తాను జడ్పీటీసీగా పోటీ చేసిన సమయంలోనూ నర్సింహ్మ ఇతరులకు సహకరించి తన ఓటమికి కారణమయ్యారని విమర్శించారు. ఎమ్మెల్యే వేముల వీరేశం సీనియర్ నాయకులకు ప్రాధాన్యతనిస్తూ, పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కుంభం అనిల్‌రెడ్డి, సీనియర్ నాయకులు గంట హనుమంతు, సర్పంచులు కురమిల్ల మల్లేష్, మల్లెబోయిన యాదగిరి, గుల్లి నరేష్, సత్యనారాయణ, కట్టంగూర్ ఉపసర్పంచ్ గుండు రాంబాబు, నాయకులు రెడ్డిపల్లి స్వామి, మేడి విజయ్ కుమార్, కత్తుల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...