3వ వార్డులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం

1000221370.jpg

అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ బూడిద జ్యోతి గోపి.జనగామ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని వార్డు కౌన్సిలర్ బూడిద జ్యోతి గోపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ సిహెచ్ రాజశేఖర్ రెడ్డి, విశిష్ట అతిథిగా మున్సిపల్ మేనేజర్ పి. ప్రభాకర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా కమిషనర్, కౌన్సిలర్ మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కుటుంబ పెద్ద అకాల మరణం లేదా అనుకోని ప్రమాదం సంభవించినప్పుడు ఆ కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించడంలో జీవిత బీమా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వార్డులోని అర్హులందరికీ పథకం అందేలా రాజకీయాలకు అతీతంగా సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు గోపి, కాంగ్రెస్ వార్డు అధ్యక్షుడు గుంటుక దామోదర్ రెడ్డి, సీనియర్ నాయకులు మార్తల ప్రభాకర్, గొట్టం శ్రీధర్ రెడ్డి, సీపీఎం శాఖ కార్యదర్శి గుండు శశిరేఖ, బీఆర్ఎస్ నాయకులు కాంటూరి అంజాజి, బీజేపీ నాయకులు కే. బాలసుబ్రమణ్యం (శివ), వార్డు ప్రముఖులు, వార్డు అధికారులు నిఖిల్ రెడ్డి, తిప్పారపు యాకుబ్, ఆర్‌పీ దుంబాల రేవతితో పాటు పలువురు నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

You may also like...