వ్యవసాయం ప్రాధాన్యతను విద్యార్థులు గుర్తించాలి – డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి
- విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరం – అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె. సందీప - November 21, 2026
- జనగామలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి విశేష స్పందన - November 21, 2026
- రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జనగామలో భారీ బైక్ ర్యాలీ నిర్వహణకు నిర్ణయం - November 21, 2026

జనగామ జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ రంగంపై ఎస్ఎఫ్ఐ SFI, అఖిల భారత రైతు సంఘం AIKS ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం గురువారం జనగామలోని విజయ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా డీసీపీ రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ వ్యవసాయం దేశానికి వెన్నెముక అని, రైతు లేనిదే దేశ మనుగడ లేదని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం వ్యవసాయ రంగంపై చూపుతున్న పరిణామాలను విద్యార్థులు తమ వ్యాసాల్లో చక్కగా వివరించారని అభినందించారు.విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్‌కు అలవాటు పడితే విద్య, భవిష్యత్తు, కుటుంబ జీవితం తీవ్రంగా దెబ్బతింటాయని హెచ్చరించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ లక్ష్యసాధన దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.అనంతరం పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు,ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో AIKS, SFI జిల్లా నాయకులు,ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
