శ్రీనిధి రుణాలు చెల్లించని వారిపై చట్టపరమైన చర్యలకు తీర్మానం.!
- ప్రమాదంలో గాయపడిన లాలూ నాయక్‌కు భూపతిరెడ్డి పరామర్శ - November 21, 2026
- ముదిరాజుల ఐక్యతతోనే హక్కులు సాధ్యం:నూకం వెంకటయ్య - November 21, 2026
- చెదురుపల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం - November 21, 2026

వెల్దండ నవంబర్ 21:చెరుకూరు గ్రామైక్య సహకార సంఘం ఆధ్వర్యంలో చెరుకూరు గ్రామంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీనిధి రుణాల రికవరీ, సీఐఎఫ్, బ్యాంకు లింకేజీ, ప్రొఫైల్, కేవైసీ తదితర అంశాలపై చర్చించారు.శ్రీనిధి రుణాలు తీసుకుని ఇప్పటివరకు చెల్లించని సభ్యులు వెంటనే బకాయిలు చెల్లించాలని సమావేశంలో సూచించారు. రుణాలు చెల్లించని వారిపై రెవెన్యూ చట్టం ప్రకారం చర్యలు తీసుకునేలా సంఘంలో తీర్మానం చేశారు.ఈ సమావేశానికి పంచాయతీ కార్యదర్శి, సీసీ రాములు, గ్రామ సంఘం ఓబీలు, ఉపసర్పంచ్ కొండలు, చిన్న సంఘాల లీడర్లు, సభ్యులు తదితరులు హాజరయ్యారు. రుణాల వసూళ్లలో సభ్యులందరూ సహకరించాలని సమావేశంలో కోరారు.
