నెల్లుట్ల చెరువు మత్తడి మరమ్మతు పనులు ప్రారంభం

నెల్లుట్ల గ్రామంలోని చెరువు మత్తడి మరమ్మతు, చెరువు కట్టపై జంగిల్ కటింగ్ పనులను గ్రామ సర్పంచ్ నర్సింగ రామకృష్ణ బుధవారం ప్రారంభించారు. చెరువు కట్టపై పెరిగిన పిచ్చి చెట్లను తొలగించడం వల్ల పరిసరాలు పరిశుభ్రంగా మారడంతో పాటు రైతులకు కోతుల బెడద తగ్గుతుందని ఈ సందర్భంగా సర్పంచ్ తెలిపారు.ఈ అభివృద్ధి పనుల కోసం రూ.20 లక్షల నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి గ్రామ పాలకవర్గం, రైతుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఈ కిషోర్ రెడ్డి, నరేందర్, ఉపసర్పంచ్ దామెర కావ్య ప్రభాకర్, వార్డు సభ్యులు వేల్పుల శోభారాణి, గొరిగే సందీప్, బొజ్జం సునీత ప్రభాకర్, బత్తిని వేణు,కొమ్మరాజుల రేణుక కొమ్మురయ్య, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు మాచర్ల మహేందర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు నర్సింగ రమేష్, కొయ్యడ రామలింగం తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2026-11-18 at 20.30.30.jpeg

You may also like...