రేపు వెల్దండలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు – పార్టీ అధ్యక్షులు హరికిషన్ నాయక్
- బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా గండికోట రాజు - November 18, 2026
- పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం – సర్పంచ్ ప్రసాద్ గౌడ్ - November 18, 2026
- కైలాసగుట్టపై రెండు హైమాస్ట్ లైట్లు ఏర్పాటు - November 18, 2026

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి నవంబర్ 18 : భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి వేడుకలను నవంబర్ 19న గురువారం ఉదయం 10 గంటలకు వెల్దండ పట్టణ కేంద్రంలోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మూడవత్ హరికిషన్ తెలిపారు.ఈ కార్యక్రమానికి జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి కాంగ్రెస్ నాయకులు, గ్రామాల సర్పంచులు, మార్కెట్ కమిటీ, సింగిల్ విండో చైర్మన్లు, డైరెక్టర్లు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.
