సాంబార్లో గండు చీమ.. ఉడిపి గ్రాండ్ నిర్లక్ష్యం!


జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి(వెబ్ డెస్క్): రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం బీడీల్ ఎక్స్ రోడ్ వద్ద ఉన్న ఉడిపి గ్రాండ్ హోటల్‌లో అపరిశుభ్రత వెలుగుచూసింది. కస్టమర్ వడ తింటూ టిఫిన్ చేస్తుండగా సాంబార్‌లో గండు చీమ కనిపించడంతో విస్తుపోయారు. హోటల్‌లో ఆహార తయారీ, పరిశుభ్రత ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్షణమే తనిఖీలు నిర్వహించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.

You may also like...