నాణ్యతతో ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించుకోండి సత్యనారాయణ గౌడ్

 కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ బిచ్కుంద మండలం శాంతాపూర్ విలేజ్ లో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియలో భాగంగా కీలక కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ భూమి పూజ నిర్వహించి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇళ్లను నాణ్యతతో నిర్మించుకోవాలని సూచించారు. పేదలకు ఆదుకునే ప్రభుత్వమని కాంగ్రెస్ పాలనను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

You may also like...