ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి భారీ నిధులు
- ఎల్నినో ప్రభావంపై రైతులకు అవగాహన.. ఎర్రపహాడ్ రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం - October 28, 2026
- మహిళా సంఘాల విజ్ఞప్తికి ఎమ్మెల్యే మదన్ మోహన్ స్పందన.. రూ.10 లక్షలతో మహిళా సమాఖ్య భవనం నిర్మాణం - October 28, 2026
- ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి భారీ నిధులు - October 28, 2026
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం, గిద్ద: గిద్ద గ్రామ ప్రజల చిరకాల డిమాండ్ నెరవేరే దిశగా రూ.2.88 కోట్లతో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గ్రామాన్ని సందర్శించి సబ్స్టేషన్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఏడు విద్యుత్ సబ్స్టేషన్లు మంజూరు చేయించడంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ చేసిన కృషి అభినందనీయమన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి ఆయన కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కొరత రానివ్వబోమని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహకారంతో పాటు జిల్లా ఇన్చార్జి మంత్రిగా తాను కూడా అభివృద్ధి పనులకు సహకరిస్తానని తెలిపారు. మహిళల సంక్షేమం, ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని వివరించారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ గిద్ద గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చేయాలన్నది ప్రజల ఎన్నో ఏళ్ల కోరికని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రూ.2.88 కోట్లతో నిర్మాణ పనులకు భూమిపూజ చేయడం సంతోషంగా ఉందన్నారు. సబ్స్టేషన్ అందుబాటులోకి వస్తే గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గిద్ద గ్రామానికి మరిన్ని నిధులు తీసుకొచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని గ్రామాలకు విద్యుత్, రహదారులు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యమన్నారు. అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, విద్యుత్ శాఖ అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

