నాగర్ కర్నూల్ జిల్లాలో 13 మండలాల్లో కరువు ప్రభావితం.
- వెల్దండ మండలంలో ఆకాశం ఎర్రగా… వింత దృశ్యం - October 28, 2026
- మాడుగులలో ఐక్యత ఫౌండేషన్ 26వ జాబ్ డ్రైవ్.. సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి - October 28, 2026
- నాగర్ కర్నూల్ జిల్లాలో 13 మండలాల్లో కరువు ప్రభావితం. - October 28, 2026

నాగర్‌కర్నూల్ : 2026 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి నాగర్ కర్నూల్ జిల్లాలో 13 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో 365 మండలాలను గుర్తిస్తూ రెవెన్యూ (విపత్తుల నిర్వహణ) శాఖ ఈ నెల 24న జీఓ ఎంఎస్ నం.03 జారీ చేయగా నాగర్ కర్నూల్ జిల్లాలో మాత్రం చారకొండ,వెల్దండ,ఊరుకొండ, పెద్దకొత్తపల్లి,వంగూరు, అమరాబాద్, పదర,బల్మూర్,లింగాల,కోడేరు, బిజినపల్లి,కల్వకుర్తి,మండలాల్లో వర్షపాతం లోటు,పంటల సాగు,నేలలో తేమ శాతం,ఉపగ్రహ చిత్రాల ఆధారంగా కరువు తీవ్రతను అంచనా వేసి మండలాలను గుర్తించారు.కరువు ప్రభావిత ప్రాంతాల్లో రైతులకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని,రుణ సదుపాయాలు కల్పించడంతోపాటు వ్యవసాయ, ఉద్యానవన,పశుసంవర్ధక శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
