వెల్దండ మండలంలో ఆకాశం ఎర్రగా… వింత దృశ్యం

1001304919.jpg

వెల్దండ,అక్టోబర్ 27 :వెల్దండ మండలం బొల్లంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఈదమ్మ బండ తండాలో మంగళవారం సాయంత్రం 6:15 గంటల సమయంలో ఆకాశం ఒక్కసారిగా ఎర్రగా మారిపోయింది.ఆకాశం మొత్తం ఎర్రటి రంగులోకి మారడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. పలువురు తమ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ఆకాశం ఎర్రబడటానికి కారణాలు:

1.సూర్యకాంతి పరిక్షేపణం: సాయంత్రం వేళ సూర్యుడు హోరిజోన్ కి దగ్గరగా ఉన్నప్పుడు కాంతి ఎక్కువ దూరం ప్రయాణించి, నీలం రంగు చెదిరిపోయి ఎరుపు రంగు మిగిలిపోతుంది.

2.మేఘాల ప్రభావం: ఎత్తైన సిర్రస్ మేఘాలు సూర్యుని ఎర్రటి కాంతిని ప్రతిబింబించడం.

3. తేమ, దుమ్ము కణాలు: వాతావరణంలో అధిక తేమ, దుమ్ము కణాలు ఉండటం వల్ల ఎరుపు రంగు మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం,తుఫాన్ ప్రభావంతో కూడా ఇలా జరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.ప్రస్తుతం ఎలాంటి భయం లేదని, ఇది సహజమైన వాతావరణ మార్పేనని స్థానికులు భావిస్తున్నారు.

You may also like...