అజిలాపూర్ భూ పట్టా మార్పిడిపై ఆర్టీఐ దరఖాస్తు

1001304289.jpg

వెల్దండ అక్టోబర్ 27 :నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం అజిలాపూర్ గ్రామ శివారులోని భూమి పట్టా మార్పిడికి సంబంధించిన వివరాలు వెల్లడించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ సిద్ధగోని రమేష్ గౌడ్, వార్డు సభ్యుడు గోరంట్ల రమేష్ తహసీల్దార్‌కు సమాచార హక్కు చట్టం–2005 కింద దరఖాస్తు సమర్పించారు.గ్రామ పరిధిలోని సర్వే నంబర్‌ 154లో ఉన్న 10 గుంటల లావుని పట్టా భూమిని సాధారణ పట్టా భూమిగా ఏ ప్రాతిపదికన మార్చారో తెలియజేయాలని వారు కోరారు. ఈ మార్పిడికి సంబంధించిన ఆధారాలు, సంబంధిత ధ్రువపత్రాల ప్రతులను అందించాలని దరఖాస్తులో పేర్కొన్నారు.అలాగే, సర్వే నంబర్‌ 154కు సంబంధించి 1954 నుంచి 2009 వరకు ఉన్న పాత రెవెన్యూ రికార్డులు (ఓల్డ్ ఆర్‌ఓఆర్‌), పహాణీలు, అప్పటి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ నిర్వహించిన పంచనామా పత్రాల ప్రతులను సమాచార హక్కు చట్టం ప్రకారం అందించాలని కోరారు.భూమి పట్టా మార్పిడికి సంబంధించిన వాస్తవాలు,రెవెన్యూ రికార్డుల ఆధారంగా వివరాలు తెలుసుకునేందుకే ఈ దరఖాస్తు సమర్పించినట్లు వారు తెలిపారు.

You may also like...