సొంత నిధులతో 30 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్ల పంపిణీ
- సొంత నిధులతో 30 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్ల పంపిణీ - October 26, 2026
- రైతులకు చివరి అవకాశం.. వెంటనే రైతు నమోదు చేసుకోండి! - October 12, 2026
- నేడు కొండాపూర్ లో విద్యుత్ అంతరాయం - October 9, 2026
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ర్ మండలం చెర్ల 
గోపులారం నుంచి మల్లేపల్లి, తేర్పోల్ ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే 30 మంది విద్యార్థులకు గుంతపల్లి సర్పంచ్ పడమటి అనంత్ రెడ్డి సోమవారం సొంత నిధులతో ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. విద్యార్థుల చదువుకు అండగా నిలిచిన ఆయన సేవలను గ్రామస్తులు అభినందించారు.
విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదిగి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని అనంత్ రెడ్డి ఆకాంక్షించారు. గతంలోనూ పలు సేవా కార్యక్రమాలు చేపట్టి పేదలకు అండగా నిలిచిన ఆయనను గ్రామస్తులు శాలువాలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మహేశ్వరి సతీష్, ఉపసర్పంచ్ పుణ్యమ్మ రాములు, వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్ రత్నయ్య, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.
