శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో దుర్గమ్మ దర్శనం.. ప్రత్యేక పూజలో పాల్గొన్న సర్పంచ్ ప్రసాద్ గౌడ్
- ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ రాజీనామాకు ఢిల్లీలో ధర్నా.. పాల్గొన్న ఎమ్మెల్యే కసిరెడ్డి - October 13, 2026
- గాయత్రి దేవి అవతారంలో అమ్మవారు దర్శనం – భక్తులతో కిటకిటలాడిన దుర్గాదేవి మండపాలు - October 13, 2026
- రేపు పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్న ఎమ్మెల్యే కసిరెడ్డి - October 13, 2026
శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం.. ప్రత్యేక పూజలో పాల్గొన్న సర్పంచ్ ప్రసాద్ గౌడ్
వెల్దండ : నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల పరిధిలోని బొల్లంపల్లి గ్రామంలో ఆదర్శ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన దుర్గామాతకు సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.అనంతరం సర్పంచ్ ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ.. అమ్మవారి అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని,గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ చొప్పరి రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బ్రహ్మచారి, ఆలంపల్లి కృష్ణ, అంజయ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కొర్ర శివ నాయక్, యువ నాయకుడు ఉప్పు వెంకట్ రావు, ఆదర్శ యువజన సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
