చేవెళ్ల బస్టాండు వద్ద దారుణ హత్య
- పోగొట్టుకున్న 67 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసిన జనగామ పోలీసులు - October 8, 2026
- రాజ్‌ఘాట్ వైపు ఇండీ కూటమి నేతలు - October 8, 2026
- రాజ్‌ఘాట్ వద్ద ఇండియా కూటమి నేతల నిరసన - October 8, 2026

చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్టాండు వద్ద గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కొందరు యువకులు ఓ వ్యక్తి నుంచి ఫోన్ లాక్కునే క్రమంలో అతడిపై దాడికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి ఆచూకీ, పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఘటనకు సంబంధించి అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఫోన్ లాక్కునే వ్యవహారమే హత్యకు కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
