భూ సర్వేను అడ్డుకున్న అజిలాపూర్ రైతులు

వెల్దండ అక్టోబర్‌ 7: డిండి–నార్లాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు పరిహారంపై స్పష్టత వచ్చే వరకు భూ సర్వేకు సహకరించేది లేదని తేల్చిచెప్పారు.బుధవారం వెల్దండ మండలం అజిలాపూర్‌లో అధికారులు పోలీసు బందోబస్తుతో చెట్ల లెక్కింపు చేపట్టగా, ముందస్తు సమాచారం ఇవ్వలేదంటూ రైతులు అడ్డుకున్నారు.సర్పంచ్‌ సిద్ధగోని రమేష్‌గౌడ్‌తో కలిసి రైతులు నిరసన తెలిపారు. పరిహారం పెంచడంతో పాటు భూములు కోల్పోతున్న ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రిజర్వాయర్‌ కోసం 187 ఎకరాల భూమి అవసరమని అధికారులు తెలిపారు.రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిహారం పెంచేలా కృషి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అయితే న్యాయమైన పరిహారం, పునరావాసంపై స్పష్టమైన హామీ వచ్చే వరకు సర్వేకు సహకరించబోమని రైతులు స్పష్టం చేశారు.1001243755.jpg

You may also like...