నవంబర్ 1, 2 తేదీలలో టీఎస్ యుటిఎఫ్ 7వ జిల్లా మహాసభలు
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 7 : నవంబర్ 1, 2 తేదీలలో కట్టంగూర్ మండల కేంద్రంలో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా 7వ మహాసభల కరపత్రాన్ని మండల విద్యాశాఖాధికారి ఎం.శ్రీలత, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఏ.అంజయ్య గురువారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉపాధ్యాయుల హక్కుల సాధనతో పాటు, సమాజ శ్రేయస్సు, ఉపాధ్యాయ సంక్షేమం, ప్రభుత్వ విద్యావ్యవస్థ బలోపేతానికి టీఎస్ యుటిఎఫ్ నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. నవంబర్ 1, 2 తేదీల్లో నిర్వహించే ఈ జిల్లా మహాసభలను ఉపాధ్యాయులు, మేధావులు, విద్యారంగ శ్రేయోభిలాషులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా
ఆహ్వాన సంఘం అధ్యక్షులు యర్కల సత్తయ్య,
ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి మురళయ్య మాట్లాడుతూ ఈ మహాసభలలో ఉపాధ్యాయులకు ఉపయుక్తంగా ఉండడానికి ఎఫ్ ఎల్ ఎన్, టి ఎల్ ఎం మేళా నిర్వహిస్తున్నామని, అదేవిధంగా సామాజిక కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు మాజీ ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ నాగేశ్వర్, అలుగుబెళ్లి నర్సిరెడ్డి లతో విద్యా,వైజ్ఞానిక సెమినార్ నిర్వహించలనట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయులు అత్యధిక సంఖ్యలో హాజరై మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షులు పి.రాములు,కోశాధికారి డి.క్రిష్ణ, ఉపాధ్యక్షులు బి.ఆంజనేయులు, ఎం.మురళీకృష్ణ,దుర్గ, జయమ్మ, శ్రీదేవి ఉన్నారు.

