తాళం వేసిన ఇంట్లో చోరీ….
- వలసలు నివారించడమే లక్ష్యం : ఏపీఓ కడెం రామ్మోహన్ - November 20, 2026
- మల్టీపర్పస్ సిబ్బందికి జీవిత బీమా భరోసా : కట్టంగూర్ సర్పంచ్ ముక్కాముల శ్యామల శేఖర్ - November 19, 2026
- నడవలేని స్థితిలోనూ పింఛన్ కోసం ఎదురుచూపులు ఐదేళ్లుగా మంచానికే పరిమితం.. నాలుగుసార్లు సదరం క్యాంపునకు వెళ్లినా ఫలితం శూన్యం - November 18, 2026
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 5 : మండల కేంద్రంలోని ఓ ఇంట్లో చోరీ అయిన సంఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కట్టంగూర్ కు చెందిన గీత కార్మికుడు యర్కల పాండు కల్లు గీసేందుకు ఇతర రాష్టం వెళ్లాడు. ఈ నెల 2 రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం పగటగొట్టి బీరువాలో ఉన్న అర తులం బంగారం, 30 తులాల వెంటి పట్టా గొలుసులు అపహరించుకుపోయారు. ఆదివారం రాత్రి పాండు కుమారుడు ఉమేష్ ఇంటికి వచ్చి చూడగా ఇంటి తలుపులు తీసి ఉన్నాయి. సోమవారం ఉమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్ఐ అంజయ్య తెలిపారు.

