ఎక్సైజ్ సీఐ మంగమ్మను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన బహుజన జన సంఘం నాయకులు

కామారెడ్డి జిల్లా బహుజన జన సంఘం మహిళా అధ్యక్షురాలు సట్టిగారి బుజ్జమ్మ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి ఎక్సైజ్ సీఐ మంగమ్మ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీఐ మంగమ్మ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆమెను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బహుజన జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర శివరాజ్, మాదిగ రాజకీయ పోరాట సమితి (MRPS) రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్. బాగయ్య తదితరులు పాల్గొన్నారు.

You may also like...