Daily Archive: November 12, 2026

పేదింటి ఆడబిడ్డ పెళ్లికి అండగా నిలిచిన మానవత్వం చాటిన కౌన్సిలర్ రామన్న .!

వెల్దండ,నవంబర్ 12 :పేదింటి ఆడబిడ్డ వివాహానికి మానవత్వంతో అండగా నిలిచారు ప్రముఖ సంఘసేవకులు,ఆర్యవైశ్య రాష్ట్ర నాయకులు, కౌన్సిలర్ పాపిశెట్టి రాము వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామానికి చెందిన జల్లెల మణెమ్మ, శ్రీనివాస్ దంపతుల కుమార్తె మేఘన వివాహానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆడబిడ్డ పెళ్లి బాధ్యతను తన బాధ్యతగా భావించి, కుటుంబానికి అండగా నిలిచారు.ఈ సందర్భంగా పాపిశెట్టి రాము మాట్లాడుతూ..పేద కుటుంబాలకు సమాజం అండగా నిలవాలి. ఆడబిడ్డ పెళ్లి అంటే ఆ కుటుంబానికి ఎంతో భారం. అలాంటి…

పేదల సొంతింటి కలను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే.. సర్పంచ్ యాదమ్మ వెంకటయ్య గౌడ్

వెల్దండ, నవంబర్ 12: పేదల సొంతింటి కలను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని, ప్రజా సంక్షేమలో పాలనలో మాకు మేమే పోటీ మాకు మేమే సాటి మా తోటి పోటీ రారెవరు అని వెల్దండ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ అన్నారు.కేంద్రానికి చెందిన కొమర లింగమ్మ – అంజయ్య కుటుంబానికి మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి గురువారం సర్పంచ్ భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేర్చడమే…

బాన్సువాడ చోరీల కేసు ఛేదన.. ఇద్దరు అరెస్ట్

బాన్సువాడ: పట్టణంలోని రెండు ఇళ్లలో జరిగిన చోరీ కేసులను పోలీసులు ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పట్టణ సీఐ తుల శ్రీధర్ తెలిపారు. శాంతినగర్ కాలనీ, హరిజనవాడలో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగలు బంగారు, వెండి ఆభరణాలు, నగదును అపహరించారు. దర్యాప్తులో భాగంగా బుధవారం బస్టాండ్ ప్రాంతంలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 29.7 తులాల వెండి, 9.8 గ్రాముల బంగారు ఆభరణాలను…

పేదింటి ఆడబిడ్డ పెళ్లికి రూ.10 వేల ఆర్థిక సాయం.. గోలి శ్రీనివాస్ రెడ్డి చేయూత.!

వెల్దండ, నవంబర్ 12: పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ, ఆడబిడ్డల వివాహాలకు తనవంతు సహకారం అందిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి.వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామానికి చెందిన జల్లెల మణెమ్మ, శ్రీనివాస్ దంపతుల కుమార్తె మేఘన వివాహం సందర్భంగా ఆయన రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా పేద కుటుంబాలకు అండగా నిలవడం సామాజిక బాధ్యతగా భావిస్తున్నానని, ఆపదలో ఉన్నవారికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ…

హైటెక్స్‌లో పౌల్ట్రీ జాతర.! మంత్రి వాకిటి శ్రీహరికి ఘన ఆహ్వానం..!

హైదరాబాద్ నవంబర్ 12 :ఈనెల 24 నుంచి 27 వరకు హైదరాబాద్ హైటెక్స్‌లో జరగనున్న 18న పౌల్ట్రీ ఇండియా ఇండస్ట్రియల్ షో కార్యక్రమానికి హాజరు కావాలని మంత్రి వాకిటి శ్రీహరిని తెలంగాణ రాష్ట్ర పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధులు ఘనంగా ఆహ్వానించారు.తెలంగాణ రాష్ట్ర పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షులు జూపల్లి భాస్కర్ రావు,సెక్రటరీ, పౌల్ట్రీ ఇండియా ప్రతినిధులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.ఈ సందర్భంగా పౌల్ట్రీ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, రైతులకు కల్పించాల్సిన సౌకర్యాలు,పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి…

కూకట్‌పల్లి సదర్ సమ్మేళనంలో వెంగళరావు

కూకట్‌పల్లి గొల్ల కురుమ సదర్ ఉత్సవ కమిటీ మరియు గండి వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ సమ్మేళన కార్యక్రమంలో వారి ప్రత్యేక ఆహ్వానం మేరకు కూకట్ పల్లి బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ శ్రీ గొట్టిముక్కల వెంగళరావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా యాదవ సోదరులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు, వారి కుటుంబాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.సదర్ సమ్మేళనం యాదవ సోదరుల ఐక్యతకు, సంస్కృతి సంప్రదాయాలకు, ఆచార…

ఏటూరునాగారంలో అభివృద్ధి పనులు ప్రారంభం

ఏటూరునాగారం, నవంబర్ 12: ములుగు జిల్లా ఏటూరునాగారం మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి పనులను సర్పంచ్ కాకులమర్రి శ్రీలత గురువారం ప్రారంభించారు.వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకించేందుకు గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణతో పాటు 10, 12, 14వ వార్డుల్లో ఇంకుడు గుంతల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అలాగే గోశాలలో పశువుల కోసం నీటి తొట్టి, షెడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి…

సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ చేసిన తుంగతుర్తి రవి

 మేడిపల్లి డివిజన్ పరిధిలోని శ్రీనివాస నగర్ కాలనీకి చెందిన తిరుమల్ రావు కి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కును అందించడం జరిగింది.మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా డీసీసీ అధ్యక్షులు వజ్రెష్ యాదవ్  సహకారంతో, మేడిపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి CMRF చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూప్రజా పాలనలో ప్రజల వద్దకే పాలన అనే లక్ష్యంతో, లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి ప్రభుత్వ సహాయాన్ని .ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి…

చిన్నారులకు ఐరన్ సిరప్ పంపిణీ చేసిన సర్పంచ్ శ్రీలత

ఏటూరునాగారం: మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని 4వ వార్డు అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం సర్పంచ్ కాకులమర్రి శ్రీలత సందర్శించారు. చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, వైద్య సేవలను పరిశీలించి, రక్తహీనత నివారణకు ఐరన్ సిరప్ పంపిణీ చేశారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అర్హులందరికీ పౌష్టికాహారం, మందులు అందించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ పర్వతాల ఎల్లయ్య, వార్డు సభ్యులు, అంగన్వాడీ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.

మల్లం వెంకట్‌ను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి

పూడూరు మండలం కంకల్ గ్రామానికి చెందిన మల్లం వెంకట్ రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న పరిగి శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి వెంకట్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని,త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.