రిపోర్టర్, ములుగు | 8074260687
Latest posts by Ananth thippanapalli
(see all) ఏటూరునాగారం, నవంబర్ 12: ములుగు జిల్లా ఏటూరునాగారం మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి పనులను సర్పంచ్ కాకులమర్రి శ్రీలత గురువారం ప్రారంభించారు.
వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకించేందుకు గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణతో పాటు 10, 12, 14వ వార్డుల్లో ఇంకుడు గుంతల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అలాగే గోశాలలో పశువుల కోసం నీటి తొట్టి, షెడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జనార్ధన్, ఉపసర్పంచ్ పర్వతాల ఎల్లయ్య, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.