పేదింటి ఆడబిడ్డ పెళ్లికి అండగా నిలిచిన మానవత్వం చాటిన కౌన్సిలర్ రామన్న .!
- మాట తప్పేది లేదు మడమ తిప్పేది లేదు -మాట నిలబెట్టుకున్న సుంకిరెడ్డి.! - November 12, 2026
- సర్పంచులకు ఓటు హక్కు ఇవ్వండి.! ప్రభుత్వానికి పోలేపల్లి సర్పంచ్ జంతుక వెంకటయ్య వినతి..! - November 12, 2026
- పేదింటి ఆడబిడ్డ పెళ్లికి అండగా నిలిచిన మానవత్వం చాటిన కౌన్సిలర్ రామన్న .! - November 12, 2026

వెల్దండ,నవంబర్ 12 :పేదింటి ఆడబిడ్డ వివాహానికి మానవత్వంతో అండగా నిలిచారు ప్రముఖ సంఘసేవకులు,ఆర్యవైశ్య రాష్ట్ర నాయకులు, కౌన్సిలర్ పాపిశెట్టి రాము వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామానికి చెందిన జల్లెల మణెమ్మ, శ్రీనివాస్ దంపతుల కుమార్తె మేఘన వివాహానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆడబిడ్డ పెళ్లి బాధ్యతను తన బాధ్యతగా భావించి, కుటుంబానికి అండగా నిలిచారు.ఈ సందర్భంగా పాపిశెట్టి రాము మాట్లాడుతూ..పేద కుటుంబాలకు సమాజం అండగా నిలవాలి. ఆడబిడ్డ పెళ్లి అంటే ఆ కుటుంబానికి ఎంతో భారం. అలాంటి సమయంలో సహాయం చేయడం మనందరి బాధ్యత అని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శేఖర్,రామన్న మిత్రమండలి సభ్యులు శ్రీను నాయక్, రామకృష్ణ, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.మేఘన వివాహ జీవితం సుఖసంతోషాలతో, సంతోషంగా సాగాలని అందరూ ఆకాంక్షించారు. పాపిశెట్టి రాము చేసిన సహాయానికి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
