మాట తప్పేది లేదు మడమ తిప్పేది లేదు -మాట నిలబెట్టుకున్న సుంకిరెడ్డి.!

1001353995.jpg

కడ్తాల్,నవంబర్ 12 :కడ్తాల్ పట్టణంలో దుర్గామాత మిత్రమండలి ఆధ్వర్యంలో జరిగిన దేవీ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.ఆ వేడుకల సమయంలో ఇచ్చిన మాట మేరకు ఐక్యత సేవా సంస్థ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి రూ.1 లక్ష ఇరవై వేలు ఆర్థిక సహాయాన్ని కమిటీ సభ్యులకు అందజేశారు.నిమజ్జనోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన వెలుగు అలంకరణలు, సంగీత ఏర్పాట్లు, వేదిక అలంకరణల కోసం ఈ సహాయం చేస్తానని ఉత్సవాల సమయంలో ఆయన మాట ఇచ్చారు. చెప్పిన మాట ప్రకారం ఉత్సవాలు ముగిసిన వెంటనే సహాయం అందించి మాట నిలబెట్టుకున్నారు.ఈ సందర్భంగా దుర్గామాత మిత్రమండలి సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ రాఘవేందర్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మాట ఇచ్చి నిలబెట్టుకునే నాయకుడు అంటూ ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో దుర్గామాత మిత్రమండలి అధ్యక్షులు కరుణాకర్, సభ్యులు రవీందర్ రెడ్డి, అశోక్ రెడ్డి తో పాటు సేవా సంస్థ సభ్యులు రమేష్, రఘు తదితరులు పాల్గొన్నారు.

You may also like...