కూకట్‌పల్లి సదర్ సమ్మేళనంలో వెంగళరావు

కూకట్‌పల్లి గొల్ల కురుమ సదర్ ఉత్సవ కమిటీ మరియు గండి వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ సమ్మేళన కార్యక్రమంలో వారి ప్రత్యేక ఆహ్వానం మేరకు కూకట్ పల్లి బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ శ్రీ గొట్టిముక్కల వెంగళరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా యాదవ సోదరులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు, వారి కుటుంబాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.సదర్ సమ్మేళనం యాదవ సోదరుల ఐక్యతకు, సంస్కృతి సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో యాదవ సోదరులు తరతరాలుగా తమ సంప్రదాయాలను కాపాడుకుంటూ సదర్ ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహించడం అభినందనీయమని గొట్టిముక్కల వెంగళరావు  పేర్కొన్నారు.

You may also like...