పేదింటి ఆడబిడ్డ పెళ్లికి రూ.10 వేల ఆర్థిక సాయం.. గోలి శ్రీనివాస్ రెడ్డి చేయూత.!

1001353688.jpg

వెల్దండ, నవంబర్ 12: పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ, ఆడబిడ్డల వివాహాలకు తనవంతు సహకారం అందిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి.వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామానికి చెందిన జల్లెల మణెమ్మ, శ్రీనివాస్ దంపతుల కుమార్తె మేఘన వివాహం సందర్భంగా ఆయన రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా పేద కుటుంబాలకు అండగా నిలవడం సామాజిక బాధ్యతగా భావిస్తున్నానని, ఆపదలో ఉన్నవారికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్, మాజీ ఎంపీటీసీ నాగులు నాయక్, మాజీ సర్పంచ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...