Daily Archive: November 12, 2026
పూడూరు మండలం కంకల్ గ్రామానికి చెందిన మల్లం వెంకట్ రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న పరిగి శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి వెంకట్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని,త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
కల్వకుర్తి నవంబర్ 12: పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ఎంతో తోడ్పాటునందిస్తోందని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.కల్వకుర్తి మండలం ఎల్లికల్ గ్రామానికి చెందిన ప్రభాతి రామస్వామికి అనారోగ్య చికిత్స నిమిత్తం సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ.18 వేల చెక్కును గురువారం అందజేశారు. గోలి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో ఈ ఆర్థిక సాయం మంజూరైంది.ఈ కార్యక్రమంలో కల్వకుర్తి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సింగం…
నర్సంపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తూ ఆత్మహత్య చేసుకున్న స్వర్గీయ శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలిచింది.ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ప్రభుత్వం, ఆర్టీసీ తరఫున కుటుంబానికి పరిహారం అందించాం. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు తమ ఒక రోజు వేతనాన్ని విరాళంగా అందించి దాదాపు రూ.కోటి ఆర్థిక సహాయం చేసి కుటుంబానికి అండగా నిలిచారు.ఇచ్చిన హామీ మేరకు శంకర్ గౌడ్ కుమారుడు హేమంత్ గౌడ్‌కు ఆర్టీసీలో రికార్డ్ ట్రేసర్ గా ఉద్యోగ…
హైదరాబాద్, నవంబర్ 12: పట్టణ పాలనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పౌరులకు మెరుగైన సేవలు అందించడంలో జీహెచ్ఎంసీ అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసేందుకు థాయ్‌లాండ్‌కు చెందిన ప్రతినిధుల బృందం నవంబర్ 11న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కార్యాలయాన్ని సందర్శించింది.థాయ్ పార్లమెంట్లో ప్రతిపక్ష నేతకు సలహాదారుగా పనిచేస్తున్న పెంగ్పనోర్ బూన్క్లమ్, ప్రోగ్రెసివ్ మూవ్మెంట్ ఫౌండేషన్ చైర్మన్ తనథోర్న్ జువాంగ్రూంగ్‌కిట్, ఫౌండేషన్ డైరెక్టర్ కుంతిడా రుంగ్రూంగ్కియాట్, సాయిరామ్ ఈ ప్రతినిధి బృందంలో ఉన్నారు.ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ…
జ్ఞాన తెలంగాణ, నవాబుపేట: పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా, ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తూ చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య చొరవ చూపారు. నవాబుపేట మండల ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన రూ.10,83,000 విలువైన చెక్కులను 23 మంది...
వాజేడు: చీకుపల్లి సమీపంలో ధర్మవరం 33 కేవీ విద్యుత్ లైన్ రోడ్డు క్రాసింగ్, చెట్ల కొమ్మల తొలగింపు పనుల నేపథ్యంలో గురువారం (12-11-2026) మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ధర్మవరం సబ్‌స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు.అంతరాయం కలిగే సమయంలో రైతులకు నిలిచిపోయిన మూడు ఫేజ్‌ల విద్యుత్‌ను రాత్రి సమయంలో తిరిగి సరఫరా చేయనున్నట్లు వాజేడు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. వినియోగదారులు, రైతులు సహకరించాలని కోరారు.
ములుగు: ములుగు జిల్లాలో ఓ దివ్యాంగ మహిళపై లైంగిక దాడి జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటన అనంతరం ఇంట్లో ఉన్న రూ.4 వేల నగదును కూడా నిందితుడు అపహరించినట్లు తెలిపారు. బాధితురాలి గుర్తింపు, వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచుతూ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడైన బాలుడిని అదుపులోకి తీసుకుని జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరిచినట్లు ఎస్సై వెంకటేశ్ వెల్లడించారు. ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది.
ములుగు: పుట్టినరోజు సందర్భంగా దివంగత కాంగ్రెస్ నేత నల్లెల్ల కుమారస్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కుంజా సూర్య పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి రవిచందర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వెంకటాపురం: నిషేధిత గుడుంబా తయారీ, విక్రయాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. నూగూరు వెంకటాపురం సీఐ ముత్యం రమేష్ నేతృత్వంలో వెంకటాపురం మండలం రామచంద్రపురం గ్రామ శివారులోని మూడు ప్రాంతాల్లో సోమవారం ఉదయం తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా 48 డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన 9,600 లీటర్ల బెల్లం వాష్‌ను ధ్వంసం చేశారు. 30 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని, తయారీకి పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో ఎస్సైలు తిరుపతి రావు, తిరుపతి రెడ్డి, పోలీస్…
జనగామలో బైక్ దొంగల ముఠా గుట్టురట్టు