Daily Archive: October 19, 2026

క్రీడాకారులను ప్రోత్సహించడంలో ఆర్ఎస్పీ ఫౌండేషన్ ముందంజ

కల్వకుర్తి:వెల్దండ మండలం చౌదర్‌పల్లి గ్రామంలో ఆర్ఎస్పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీపీఎల్‌-7 క్రికెట్ పోటీలను ఫౌండేషన్ బోర్డు సభ్యుడు దొబ్బల భాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రికెట్ క్రీడాకారులకు టీషర్ట్లు పంపిణీ చేశారు.ఆర్ఎస్పీ ఫౌండేషన్ విద్య, వైద్య రంగాలతో పాటు క్రీడాకారులను ప్రోత్సహించడంలోనూ ముందుంటుందని నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే పలు కార్యక్రమాల ద్వారా విద్యార్థులను, యువతను ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ఎస్పీ ఫౌండేషన్ డైరెక్టర్ అశ్విన్ కుమార్, బోర్డు సభ్యులు బండగల్లు చందు, కొమ్ము కిరణ్ కుమార్,…

మాజీ ఎంపీటీసీ అనురాధకు కాంగ్రెస్ నేతల నివాళి

మాజీ ఎంపీటీసీ అనురాధకు కాంగ్రెస్ నేతల నివాళిజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 16 : మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హైకోర్టు అడ్వకేట్ శేరి చత్రపతి సతీమణి అనురాధ ఇటీవల మృతి చెందింది. ఆమె దశదిన కార్యక్రమంలో శుక్రవారం బి ఎన్ గౌడ్ ఫంక్షనల్ లో జరిగింది. ఈ సందర్భంగా శాసనమండలి డిప్యూటీ మాజీ చైర్మన్ నేటి విద్యాసాగర్, టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ లు పాల్గొని అనురాధ…

ఘనంగా కుంకుమార్చన కార్యక్రమం

ఘనంగా కుంకుమార్చన కార్యక్రమం జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 16 :మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీశ్రీశ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం దుర్గాదేవి ఆలయం లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆరవ రోజు శుక్రవారం కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి రామడుగు శ్రీనివాస శర్మ,రామడుగు అశ్విన్ శర్మల ఆధ్వర్యంలో మహిళలతో సామూహికంగా అమ్మవారికి కుంకుమార్చనను నిర్వహించారు. పూజా కార్యక్రమాలలో మిట్టపల్లి శివ స్వాతి దంపతులు, ఆలయ కమిటీ సభ్యులు ఐదవ వార్డు…

స్మార్ట్ రేషన్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలి : పరడ సురేందర్ గౌడ్

స్మార్ట్ రేషన్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలి : పరడ సురేందర్ గౌడ్ జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 16 : ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ది దారులు సద్వినియోగం చేసుకోవాలని మండలంలోని పరడ సర్పంచ్ కొలిపాక సురేందర్ గౌడ్ అన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన స్మార్ట్ రేషన్ కార్డులను శుక్రవారం లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అర్హులైన పేద కుటుంబాల కు రేషన్ కార్డులు…

వెల్దండలో బాధితురాలిని పరామర్శించిన ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి

వెల్దండ : వెల్దండ మండల కేంద్రానికి చెందిన నాగిళ్ల భారతమ్మ ఇటీవల గుండెపోటుకు గురై హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు.విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి గారు బుధవారం ఆమె నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. అనంతరం తక్షణ సహాయంగా రూ.10,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో వెల్దండ…

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి..సమ్మెకు ఏఐటీయూసీ సంపూర్ణ మద్దతు

నాగర్‌కర్నూల్: ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను క్రమబద్ధీకరించి పర్మినెంట్ చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మారేడు శివశంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ ఎదుట ఎన్‌హెచ్‌ఎం సిబ్బంది చేపట్టిన నిరసనకు ఏఐటీయూసీ మద్దతు ప్రకటించింది.ఈ సందర్భంగా నాయకులు బిజ్జా శ్రీనివాసులు, మారేడు శివశంకర్ మాట్లాడుతూ.. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన వైద్య సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎన్నికల హామీ మేరకు క్రమబద్ధీకరించాలని కోరారు. పెండింగ్ జీతాలు, ఇంక్రిమెంట్లు చెల్లించడంతో పాటు మహిళా ఉద్యోగులకు ప్రసూతి…

అంగన్వాడీ టీచర్ దొబ్బల చంద్రకళకు సిల్వర్ అవార్డు

కల్వకుర్తి అక్టోబర్ 16 :మిషన్ బాల ఉదయంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వెల్దండ మండలం చెరుకూరు సెక్టార్ పరిధిలోని చౌదర్‌పల్లి అంగన్వాడీ టీచర్ దొబ్బల చంద్రకళకు సిల్వర్ అవార్డు, ప్రశంసా పత్రం లభించాయి. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏవో చంద్రశేఖర్ అవార్డును అందజేశారు.అంతకుముందు జిల్లా కార్యాలయంలో అంగన్వాడీ సిబ్బంది ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. పూలతో బతుకమ్మలను పేర్చి సంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూఓ, పోషణ అభియాన్ విజ్ఞాన్, పర్యవేక్షకులు వనజ,…

తుల్జా భవానీ ఆలయ అభివృద్ధికి సుంకిరెడ్డి రూ.1.20 లక్షల విరాళం

కడ్తాల్ అక్టోబర్ 16 :కడ్తాల్ మండలం వెలుగురాళ్ల తండాలో శ్రీ తుల్జా భవానీ మాత విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ పెయింటింగ్ పనుల కోసం రూ.1.20 లక్షల విరాళాన్ని అందించారు. ఆలయాల అభివృద్ధికి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు.విరాళం అందించిన రాఘవేందర్ రెడ్డికి ఆలయ కమిటీ…

అత్యంత కీలకమైన 8 నెలలు: తాగునీటి పొదుపుపై జలమండలి ఫోకస్.

రానున్న 8 నెలలు నీటి సంరక్షణకు అత్యంత కీలకమని, తాగునీటి వనరులపై ఒత్తిడి తగ్గించేందుకు నిర్మాణ రంగానికి చెందిన క్రెడాయ్, నరెడ్కో, టీబీఎఫ్ ప్రతినిధులు జలమండలికి పూర్తి సహకారం అందిస్తామని ప్రకటించారు.

సేఫర్ స్ట్రీట్స్ బెటర్ కనెక్టివిటీ సైబరాబాద్ అర్బన్ మొబిలిటీలో సరికొత్త మార్పులు.

సైబరాబాద్:ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు కనుగొనడం మరియు మౌలిక వసతుల మెరుగుదలకు ప్రాధాన్యతనిస్తూ, సైబరాబాద్‌ పోలీస్ కమిషనర్ ఎం. రమేష్ (IPS) ఆధ్వర్యంలో "మల్టీమోడల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్‌తో సైబరాబాద్ అర్బన్ మొబిలిటీ రూపకల్పన" అనే అంశంపై ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. వరల్డ్ రీసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ (WRI) ఫెలో శ్రీనివాస్ మరియు వారి బృందం ఈ సమావేశాన్ని నడిపించారు.ఈ సమావేశంలో చందానగర్ మున్సిపల్ కమిషనర్ (CMC) గుమ్మళ్ల సృజన, ట్రాఫిక్ డీసీపీ-I రవికుమార్,…