స్మార్ట్ రేషన్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలి : పరడ సురేందర్ గౌడ్

స్మార్ట్ రేషన్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలి : పరడ సురేందర్ గౌడ్

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 16 : ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ది దారులు సద్వినియోగం చేసుకోవాలని మండలంలోని పరడ సర్పంచ్ కొలిపాక సురేందర్ గౌడ్ అన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన స్మార్ట్ రేషన్ కార్డులను శుక్రవారం లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అర్హులైన పేద కుటుంబాల కు రేషన్ కార్డులు అందించడం ద్వారా ప్రభుత్వం అందించే నిత్యావసర సరుకులు, ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందే అవకాశం కలుగుతుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను అర్హులైన ప్రతి కుటుంబం వినియోగిం చుకోవాలని సూచించారు. గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రజాప్రతినిధులు, అధి కారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిపిఓ మన్నన్, వీఆర్ఏ లతీఫ్, వార్డు సభ్యులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.1000379618.jpg

You may also like...