సేఫర్ స్ట్రీట్స్ బెటర్ కనెక్టివిటీ సైబరాబాద్ అర్బన్ మొబిలిటీలో సరికొత్త మార్పులు.
- కల్వకుంట్ల కవిత, సర్వేష్ ముదిరాజ్ సమక్షంలో శబరిమల పోస్టర్ ఆవిష్కరణ - October 19, 2026
- అత్యంత కీలకమైన 8 నెలలు: తాగునీటి పొదుపుపై జలమండలి ఫోకస్. - October 19, 2026
- సేఫర్ స్ట్రీట్స్ బెటర్ కనెక్టివిటీ సైబరాబాద్ అర్బన్ మొబిలిటీలో సరికొత్త మార్పులు. - October 19, 2026

సైబరాబాద్:ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు కనుగొనడం మరియు మౌలిక వసతుల మెరుగుదలకు ప్రాధాన్యతనిస్తూ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. రమేష్ (IPS) ఆధ్వర్యంలో "మల్టీమోడల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్తో సైబరాబాద్ అర్బన్ మొబిలిటీ రూపకల్పన" అనే అంశంపై ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. వరల్డ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (WRI) ఫెలో శ్రీనివాస్ మరియు వారి బృందం ఈ సమావేశాన్ని నడిపించారు.
ఈ సమావేశంలో చందానగర్ మున్సిపల్ కమిషనర్ (CMC) గుమ్మళ్ల సృజన, ట్రాఫిక్ డీసీపీ-I రవికుమార్, ఎస్సీఎస్సీ (SCSC) సీఈఓ నవేద్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ (అడ్మిన్) సురేష్ మరియు ట్రాఫిక్ కోఆర్డినేటర్ సాత్విక్ తదితరులు పాల్గొన్నారు.
ప్రమాద రహిత సైబరాబాద్ లక్ష్యంగా సురక్షితమైన రహదారులు, జంక్షన్ల అభివృద్ధి మరియు ట్రాఫిక్ ఇంజనీరింగ్ విధానాలపై సుదీర్ఘంగా చర్చించారు.
వాహనాల రాకపోకలు (Traffic Flow) సజావుగా సాగేలా క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు. ఐటీ కారిడార్ మరియు పరిసర ప్రాంతాలలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచి, మెట్రో లేదా బస్ స్టాండ్ల నుండి ఆఖరి గమ్యస్థానానికి చేరుకునే కనెక్టివిటీని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు.
వాహనదారుల ప్రవర్తనలో సానుకూల మార్పులు తీసుకురావడానికి సోషల్ మీడియా అవగాహన కార్యక్రమాలు మరియు ప్రజా రవాణాను ప్రోత్సహించడంలో మీడియా పాత్రను ఉపయోగించుకోవాలని నిర్ణయించారు.
క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది, ప్లానింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, మౌలిక సదుపాయాల మెరుగుదలకు అవసరమైన ఆచరణాత్మక పరిష్కారాలను పంచుకోవాలని సీపీ ఎం. రమేష్ సూచించారు. రోడ్డు ఇంజనీరింగ్ సంస్థలతో (R&B, GHMC, NHAI) నిరంతరం సమన్వయం చేసుకుంటూ మౌలిక వసతుల లోపాలను త్వరితగతిన సరిచేయాలని అధికారులను ఆదేశించారు.
