దుర్గామాతకు ప్రత్యేక పూజలు.. బీజేపీ నూతన బాధ్యులకు సన్మానం

తలకొండపల్లి: మండల కేంద్రంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గామాత అమ్మవారిని బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ మండల అధ్యక్షుడు దోర్నాల వెంకటేశ్వర్ రెడ్డి ఇతర నాయకులతో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా బీజేపీలో నూతన బాధ్యతలు చేపట్టిన మండల అధ్యక్షుడు నీలకంఠ పాండు, దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు పెరుమాళ్ల రాజు, భారతీయ జనతా యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మ అనిల్ ముదిరాజ్‌లను వెంకటేశ్వర్ రెడ్డి శాలువాలతో సన్మానించి మిఠాయిలు తినిపించారు. పార్టీని మరింత బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నర్సింహా, ఈసారి బాలకృష్ణ, శ్రీను, వెంకటేష్, పుట్ట రాము, ప్రవీణ్, నాయిని కుమార్, అనుపటి సురేష్‌తో పాటు దుర్గామాత ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.1001266932.jpg

You may also like...