ఆమనగల్ మండల ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక

1001223414.jpg

ఆమనగల్: కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్ మండలంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు కలకొండ యాదగిరి ఆధ్వర్యంలో బుధవారం ఆమనగల్ మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మేడి పాపన్న, రాష్ట్ర అధ్యక్షులు కేదాస్ మోహన్ ఆదేశాల మేరకు నూతన కమిటీని ఎన్నుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఆమనగల్ మండల అధ్యక్షునిగా కంబాలపల్లి ప్రవీణ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వెంటనే అమలు చేయాలని, చేవెళ్ల డిక్లరేషన్ సాక్షిగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని, అదేవిధంగా దళిత బంధు స్థానంలో అంబేద్కర్ పథకం రూ 12 లక్షల రూపాయలు వెంటనే అమలు చేయాలని, జీవో నెంబర్ 48 49 ప్రకారం దళితులు గవర్నమెంట్ స్థలాల్లో ఇల్లు కట్టుకున్న వారికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో, కాలేజీలలో ఎస్సీలకు 20 శాతం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం దళితుల నుండి లాక్కున్న సైనిక భూములను వెంటనే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ రవికుమార్, కంబాలపల్లి కుమార్, మల్లేష్ శ్రీను వినయ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...