మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నేత ఆర్థిక చేయూత

1001223475.jpg

తలకొండపల్లి: మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ రంగయ్య కుమారుడు చలచిమల చంద్రయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, లింగారావు పల్లి సర్పంచ్ కాసు శ్రీనివాస్ రెడ్డి మృతుడి కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు. అనంతరం కుటుంబానికి రూ.4 వేల ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా కాసు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రంగయ్య తన జీవితాన్ని కాంగ్రెస్ పార్టీకి అంకితం చేశారని, వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆమనగల్ ఏఎంసీ డైరెక్టర్ అజీమ్, మీసేవ మల్లేష్, పోతుగంటి గణేష్, బోల యాదగిరి, అశ్వ యాదయ్య, పురుషోత్తం, పోతుగంటి సురేష్, కట్టుక వెంకటయ్య, కిరణ్, పెరుమాండ్ల శ్రీశైలం, జూలపల్లి ఆంజనేయులు, సుదర్శన్, పెరుమాండ్ల భాస్కర్, పోతుగంటి కృష్ణ, శ్రీను, శేఖర్, పోతుగంటి శ్రీను, కట్టు మల్ల సాయి తదితరులు పాల్గొన్నారు.

You may also like...