పోలేపల్లి కి ఆర్టీసీ బస్సులు నడపాలని గ్రామస్తుల డిమాండ్

1001222223.jpg

ఆమనగల్లు: మండలం పోలేపల్లి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామ సర్పంచ్ వెంకటయ్య డిమాండ్ చేశారు. ఆమనగల్లు నుంచి పోలేపల్లి వరకు బస్సులు నడపడంతో పాటు గిరికొత్తపల్లి వైపు వెళ్లే బస్సులను పోలేపల్లి మీదుగా రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ సమస్యపై ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందించడంతో పాటు మహేశ్వరం ఆర్టీసీ డిపో అధికారులకు కూడా వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. ఆమనగల్లు మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో బస్సు సౌకర్యంపై చర్చ జరగగా, పది రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని డిపో మేనేజర్ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.హామీ గడువులోగా పోలేపల్లికి బస్సు సౌకర్యం కల్పించకపోతే గ్రామస్తులతో కలిసి శాంతియుతంగా ధర్నా చేపడతామని సర్పంచ్ వెంకటయ్య తెలిపారు. గ్రామ ప్రజలు, రైతులు, మహిళలు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు అందరూ సమస్య పరిష్కారానికి సహకరించాలని కోరారు.

You may also like...