డీజిల్ దందా గుట్టురట్టు

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 26 : మండలంలోని అయిటిపాముల గ్రామంలో ఇళ్లతో పాటు హోటల్లో అక్రమంగా డీజిల్ నిల్వ ఉంచిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు నకిరేకల్, నల్లగొండ సివిల్ సప్లయ్ అధికారులు, కట్టంగూర్ పోలీసులు సంయుక్తంగా శనివారం దాడులు నిర్వహించి సుమారు 2700లీటర్ల డీజిల్ ను సీజ్ చేశారు. హోటల్ యజమాని నారగోని సంధ్యతో పాటు దొమ్మటి మంగమ్మ, నారగోని యాదమ్మలు ఇళ్లలో అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా నిల్వ ఉంచిన డీజిల్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. దాడుల్లో నకిరేకల్, నల్లగొండ సివిల్ సప్లయ్ డిప్యూటీ తాసీల్దార్లు రాచకొండ జ్యోతి, దీపక్ కుమార్, నల్లగొండ సివిల్ సప్లయ్ ఆర్ ఐ కుమార్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ మునాస సత్యనారాయణ, కానిస్టేబుల్ ప్రసాద్ ఉన్నారు.

You may also like...