రిపోర్టర్, మేడ్చల్-మల్కాజ్గిరి | 9966689865
Latest posts by Veeranna Yerra
(see all) మల్కాజిగిరి: ఎస్ఓటీ ఉప్పల్ జోన్, నాచారం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో 3.180 కిలోల హాషిష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నవంబర్ 16న ఐడీఏ నాచారంలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. స్వాధీనం చేసుకున్న మత్తుపదార్థం విలువ సుమారు రూ.40 లక్షలు. మూడు సెల్ఫోన్లు, టీవీఎస్ జూపిటర్ స్కూటీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన సరఫరాదారు వెంకట్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీపీ బి.సుమతి, ఐపీఎస్ పర్యవేక్షణలో సీనియర్ అధికారుల మార్గదర్శకత్వంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు. మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా చర్యలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.
