శంకర్పల్లి మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఎం.డి. నసీరుద్దీన్ నియామకం
శంకర్పల్లి మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఎం.డి. నసీరుద్దీన్ నియామకంశంకర్పల్లి: ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ శంకర్పల్లి మండల మైనార్టీ సెల్ నూతన అధ్యక్షుడిగా ఎం.డి. నసీరుద్దీన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నియామకం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ, మైనార్టీల అభ్యున్నతికి మరియు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
