సైదాపూర్‌లో సదా బహార్ పత్తిపై క్షేత్ర ప్రదర్శన
- సైదాపూర్‌లో సదా బహార్ పత్తిపై క్షేత్ర ప్రదర్శన - September 30, 2026
- ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా..? - September 29, 2026
- తొగరుపల్లి జెడ్పీహెచ్ఎస్లో నమూనా పార్లమెంట్ - September 28, 2026

జ్ఞాన తెలంగాణ, కొండాపూర్: కొండాపూర్ మండలం సైదాపూర్ గ్రామంలో ఆదిత్య అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో బుధవారం రైతులకు సదా బహార్ పత్తి విత్తనాలపై క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. రైతు లక్ష్మన్ గౌడ్ పత్తి పొలంలో నిర్వహించిన కార్యక్రమంలో టెరిటరీ సేల్స్ ట్రైనీలు సీహెచ్. సంగారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ సదా బహార్ పత్తి విత్తనాలను సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు. పత్తి సాగు విధానం, పంట దిగుబడి తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్ రామా గౌడ్, రైతులు మల్లా గౌడ్, శంకరయ్య, వెంకటేష్, కృష్ణ, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
