22ఏ భూములపై నేడు కేబినెట్ కీలక భేటీ
- కేబినెట్ ముందుకు కీలక నిర్ణయాలు.. - October 1, 2026
- ఈశాన్యంలో రికార్డు కరువు - October 1, 2026
- నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ - October 1, 2026

- మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సమావేశం
- సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన భేటీ
- 22ఏ జాబితా అంశంపై ప్రధానంగా చర్చ
- అర్హత ఉన్న ప్రైవేట్ ఆస్తుల రిజిస్ట్రేషన్లపై నిర్ణయాలు
- ధరణి, రెవెన్యూ అంశాలపైనా చర్చకు అవకాశం
జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నేడు మధ్యాహ్నం 3 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో సమావేశం కానుంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో 22ఏ జాబితాలోని భూముల అంశం కీలకంగా చర్చకు రానుంది. సెక్షన్ 22ఏ కింద నిషేధిత జాబితాలో ఉన్న అర్హత కలిగిన ప్రైవేట్ ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం చేసే అంశంపై ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ప్రభుత్వ అనుమతులతో కూడిన లేఅవుట్లు, భవనాలు, అపార్ట్‌మెంట్లకు సంబంధించిన అర్హత కలిగిన ఆస్తులను 22ఏ జాబితా నుంచి తొలగించే ప్రక్రియపై తాజాగా ఆదేశాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో మిగిలిన సమస్యలు, పెండింగ్ దరఖాస్తులు, భూ రిజిస్ట్రేషన్లకు ఎదురవుతున్న అడ్డంకులపై కేబినెట్ సమీక్షించే అవకాశం ఉంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల 22ఏ భూములకు సంబంధించిన సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. దీంతో నేటి కేబినెట్ భేటీపై భూ యజమానులు, రియల్ ఎస్టేట్ వర్గాలు, రిజిస్ట్రేషన్ సమస్యలను ఎదుర్కొంటున్న ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ధరణి, రెవెన్యూ వ్యవహారాలతో పాటు ఉద్యోగుల సమస్యలు, ఆర్థిక అంశాలు, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు
