ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తీపి కబురు
- బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026
- శంకర్పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తీపి కబురు
- పెండింగ్ లో ఉన్న 180.38 కోట్ల మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు ఒకేసారి క్లియర్. 26,519 మంది ఊరట
- గత ప్రభుత్వంలోని పెండింగ్ బిల్లులను సైతం క్లియర్ చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ప్రజా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్న ఉద్యోగ సంఘాలు,పెన్షనర్లు
జ్ఞానతెలంగాణ, హైదరాబాద్ (వెబ్ డెస్క్):
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన మెడికల్ రియంబర్స్మెంట్ పెండింగ్ బిల్లుల మొత్తం 180.38 కోట్లు నిధులను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మల్లు ఒకేసారి విడుదల చేశారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు, లెక్కకు మించిన సంక్షేమ పథకాలు మరోవైపు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ రీయంబర్స్మెంట్ బిల్లులకు ప్రాధాన్యత ఇస్తూ డిప్యూటీ సీఎం వాటిని క్లియర్ చేశారు.
గత ప్రభుత్వం కాలం లో 04- 03- 2023 నుంచి 20-06-2025 వరకు పెండింగ్లో ఉన్న బిల్లులను క్లియర్ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో 26,519 మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట కలిగింది.
