కల్వకుర్తిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహ భూమి పూజ
- అరెస్టులతో ప్రజల గొంతు నొక్కలేరు - October 1, 2026
- కల్వకుర్తిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహ భూమి పూజ - October 1, 2026
- మృతుని కుటుంబానికి బీఆర్ఎస్ నాయకుల ఆర్థిక చేయూత - October 1, 2026
కల్వకుర్తిలో అంబేద్కర్ కాంస్య విగ్రహ భూమిపూజ
కల్వకుర్తి: పట్టణంలోని మహబూబ్‌నగర్ చౌరస్తాలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని రూ.50 లక్షల నిధులతో నూతనంగా ఏర్పాటు చేయనున్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో చేపట్టనున్న విగ్రహ ఏర్పాటుకు సంబంధించి అక్టోబర్ 2న శుక్రవారం ఉదయం 9 గంటలకు భూమిపూజ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మున్సిపల్ చైర్మన్ బృంగి రత్నమాల ఆనంద్‌కుమార్, వైస్ చైర్మన్ షానవాజ్ ఖాన్, కౌన్సిలర్లు, వివిధ కుల సంఘాల నాయకులు హాజరుకానున్నారు.బహుజన మేధావులు, అంబేద్కర్‌వాదులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని భూమిపూజ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
