Author: PAKADI RAMANJANEYULU

లక్షలాది గొంతుకలు ఏకమై జై తెలంగాణ అని నినదించిన రోజు

నాగర్ కర్నూల్ : సెప్టెంబర్ 30, 2012 ఆంక్షలను, నిర్బంధాలను, ముళ్లకంచెలను, లాఠీచార్జీలను, రబ్బర్ బుల్లెట్లను లెక్కచేయకుండా.. హుస్సేన్‌సాగర్ తీరం ‘జై తెలంగాణ’ నినాదాలతో మార్మోగింది.ఉమ్మడి పాలకుల కుట్రలను తిప్పికొడుతూ.. ఉద్యమకారులు, తెలంగాణవాదులు ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన చారిత్రక ఘట్టం ఇది.తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లడంలో, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంలో సాగరహారం కీలక ఘట్టంగా నిలిచింది.

ఆమనగల్ మండల ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక

ఆమనగల్: కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్ మండలంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు కలకొండ యాదగిరి ఆధ్వర్యంలో బుధవారం ఆమనగల్ మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మేడి పాపన్న, రాష్ట్ర అధ్యక్షులు కేదాస్ మోహన్ ఆదేశాల మేరకు నూతన కమిటీని ఎన్నుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఆమనగల్ మండల అధ్యక్షునిగా కంబాలపల్లి ప్రవీణ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వెంటనే అమలు చేయాలని, చేవెళ్ల డిక్లరేషన్ సాక్షిగా…

మాజీ ఎంపిటిసి పులికంటి లక్ష్మి కుటుంబానికి వంశీ చంద్ రెడ్డి పరామర్శ

రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం మాడుగుల గ్రామ మాజీ ఎంపీటీసీ పులి కంటి లక్ష్మి కుటుంబాన్ని చరవాణి ద్వారా పరామర్శించారు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, సిడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితులు డాక్టర్ చల్లా వంశీ చంద్ రెడ్డి మంగళవారం లక్ష్మమ్మ భర్త ప్రముఖ దళిత ఉపాధ్యాయ సంఘం నాయకులు మరియు వ్యక్తిగతంగా అత్యంత సుపరిచితులైన పరిచయమైన పులికంటి లక్ష్మయ్య ను చరవాణిలో సంప్రదించి, అకాల మరణం పట్ల సానుభూతి తెలిపారు.

పోలేపల్లి కి ఆర్టీసీ బస్సులు నడపాలని గ్రామస్తుల డిమాండ్

ఆమనగల్లు: మండలం పోలేపల్లి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామ సర్పంచ్ వెంకటయ్య డిమాండ్ చేశారు. ఆమనగల్లు నుంచి పోలేపల్లి వరకు బస్సులు నడపడంతో పాటు గిరికొత్తపల్లి వైపు వెళ్లే బస్సులను పోలేపల్లి మీదుగా రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ సమస్యపై ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందించడంతో పాటు మహేశ్వరం ఆర్టీసీ డిపో అధికారులకు కూడా వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. ఆమనగల్లు మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో బస్సు సౌకర్యంపై చర్చ జరగగా, పది…

నూకం శేఖర్ కుటుంబానికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పరామర్శ

కల్వకుర్తి: తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన నూకం శేఖర్ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు.మంగళవారం వారి కుటుంబాన్ని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. శేఖర్ మరణించడం చాలా బాధాకరమని వారి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా తోడుగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు జిల్లా నాయకులు వివిధ గ్రామాల సర్పంచులు ఉపసర్పంచ్ గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి సెప్టెంబర్ 29 : ఉపాధ్యాయుల సేవలను గుర్తించి ప్రోత్సహించడం సమాజ బాధ్యత అని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఉపాధ్యాయ వృత్తి అత్యంత గౌరవ ప్రదమైనదని, విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు అందిస్తూ సమాజాన్ని సన్మార్గంలో నడిపించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలోని దేవకీ ఫంక్షన్ హాల్‌లో మండల పార్టీ అధ్యక్షుడు కాసు శ్రీనివాస్ రెడ్డి సహకారంతో మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమాన్ని…

ఎంబీబీఎస్ సీట్ సాధించిన సరితకు గోలి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక చేయూత

వెల్దండ: మండల కేంద్రానికి చెందిన గుద్దటి శేఖర్–అలివేల దంపతుల కుమార్తె గుద్దటి సరిత ఎంబీబీఎస్ సీటు సాధించి వైద్య విద్యలో ప్రవేశం పొందిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా సరితతో పాటు ఆమె తల్లి అలివేలమ్మను శాలువాలతో సన్మానించి, ఉన్నత విద్యకు రూ.10 వేల ఆర్థిక సహాయం అందించారు.గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థిని ప్రతిభతో ఎంబీబీఎస్ సీటు సాధించడం అభినందనీయమని గోలి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సరిత…

జుట్టు తిరుపతి ముదిరాజ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కసిరెడ్డి

కల్వకుర్తి :తలకొండపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కాసు శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో జుట్టు తిరుపతి ముదిరాజ్ నివాసానికి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మంగళవారం విచ్చేశారు. ఈ సందర్భంగా తిరుపతి ముదిరాజ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో స్టంట్ వేయించుకున్న ఆయన భార్య పద్మమ్మ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ధైర్యం చెప్పారు.అనంతరం కుటుంబ సమస్యలు, స్థానిక సమస్యలపై ఆరా తీశారు. మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, కార్యకర్తల సంక్షేమంపై నాయకులతో చర్చించారు. కార్యకర్తలకు, వారి కుటుంబాలకు…

అవసరమైన సంక్షేమ పథకాలనే అమలు చేయాలి.. డీకే మాదిగ

నాగర్ కర్నూల్ : ప్రజలకు అవసరం లేని ఉచిత పథకాలకు బదులుగా విద్య, వైద్యం, ఉపాధి, రైతులకు గిట్టుబాటు ధర, ఆర్టీసీ పరిరక్షణ వంటి మౌలిక అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని బీఆర్‌ఎస్ పార్టీ కొల్లాపూర్ నియోజకవర్గ సోషల్ మీడియా వారియర్స్ డీకే మాదిగ, మామిళ్లపల్లి శ్రీనివాస్ కోరారు. పేదల సంక్షేమం పేరుతో అమలు చేస్తున్న పథకాల వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందించడంతో పాటు…

మాజీ సర్పంచ్ లక్ష్మణ్ నాయక్ 6వ వర్ధంతి సందర్భంగా అన్నదానం

వెల్దండ మండల పరిధిలోని మహాత్మాగాంధీ కాలనీ తండా మాజీ సర్పంచ్ స్వర్గీయ ముడావత్ లక్ష్మణ్ నాయక్ 6వ వర్ధంతిని కుటుంబ సభ్యులు సేవా కార్యక్రమంతో నిర్వహించారు. ఈ సందర్భంగా నిలోఫర్ ఆసుపత్రి సమీపంలో సుమారు 300 మంది పేదలు, అవసరంలో ఉన్న వారికి టిఫిన్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. లక్ష్మణ్ నాయక్ సేవాభావాన్ని స్మరించుకుంటూ ప్రతి ఏడాది సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయన చూపిన సేవా మార్గంలో నడవడమే ఆయనకు అందించే…