అరెస్టులతో ప్రజల గొంతు నొక్కలేరు

కోడేరు :హిందూ దేవుళ్లపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసినట్లు ఆరోపిస్తున్న అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కోడేరు మండల కేంద్రంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించిన బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకుని ముందస్తుగా అరెస్టు చేశారు.ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు సొప్పరి రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రజల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలను నిరసిస్తూ చేపట్టిన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. అరెస్టులతో ప్రజల గొంతుకను నొక్కలేరని పేర్కొన్నారు.ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి మొగిలి ఆంజనేయులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.1001226286.jpg

You may also like...