Author: PAKADI RAMANJANEYULU

ప్రజా ఆరోగ్య పరిరక్షణకు.. ఐక్యత ఫౌండేషన్ స్వచ్ఛ జలధార

వెల్దండ సెప్టెంబర్ -25 వెల్దండ మండలం తిమ్మినోని పల్లి గ్రామంలోత్రాగునీటి నిల్వ ట్యాంకుల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు.ప్రజలకు పరిశుభ్రమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతోఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో చేపట్టిన “స్వచ్ఛ జలధార” కార్యక్రమం రెండవ విడతలో భాగంగ వెల్దండ మండలం తిమ్మినోని పల్లి గ్రామంలో త్రాగునీటి నిల్వ ట్యాంకులను పరిశుభ్రపరిచారు.జర్మన్ సాంకేతికతతో కూడిన ప్రత్యేక యంత్రాల సహాయంతో ట్యాంకుల్లో పేరుకుపోయిన మురికి, వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో తొలగించి పరిశుభ్రపరిచారు.ఈ కార్యక్రమంలో తిమ్మినోని పల్లి…

గూడు లేని నిరుపేదలకు ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యం

వెల్దండ: ప్రజా ప్రభుత్వంలోనే నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్నామని వెల్దండ గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, డీసీసీ ఉపాధ్యక్షులు యెన్నం భూపతి రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ లో భాగంగా మండల కేంద్రంలోని కదమంచి సత్యమ్మ కు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ చేసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రత్యేక చొరవతో…

యువతకు సాంకేతిక నైపుణ్యాలు – 5500 మందికి శిక్షణ

వెల్లడం సెప్టెంబర్‌ 19: తెలంగాణ యువతకు భవిష్యత్‌ సాంకేతిక నైపుణ్యాలు అందించి ఉపాధి అవకాశాలకు అనుసంధానం చేయడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సాంకేతిక విద్య, ఉపాధి శిక్షణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 25 కేంద్రాల్లో 5,500 మంది విద్యార్థులకు మూడు నెలలపాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. కృత్రిమ మేధస్సు, మేఘ గణన, డిజిటల్‌ నైపుణ్యాలు, ఎలక్ట్రానిక్స్‌ తయారీ వంటి ఆధునిక…

వరుసగా రెండోసారి లడ్డు దక్కించుకున్న రేవెల్లి దర్గయ్య.. భారీగా రూ. 65000

వెల్దండ: వినాయక చవితి సందర్భంగా శ్రీరామ గణేష్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డూ వేలంపాట ఉత్సాహంగా సాగింది. వేలంపాటలో రేవల్లి దర్గయ్య వరుసగా రెండోసారి లడ్డూ ప్రసాదాన్ని సొంతం చేసుకున్నారు. ఈసారి రూ.65 వేల ధరకు లడ్డూను దక్కించుకున్నారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ హాజరై దర్గయ్యకు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్, శ్రీరామ గణేష్ యూత్, ఆలయ కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు…

ఘనంగా నీలకంఠం పాండు జన్మదిన వేడుకలు

తలకొండపల్లి: తలకొండపల్లి బీజేపీ మండల అధ్యక్షుడు నీలకంఠం పాండు పుట్టినరోజు సందర్భంగా మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి పాండుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆత్మీయులకు నీలకంఠం పాండు కృతజ్ఞతలు తెలిపారు.

చల్లపల్లిలో బాల భక్త బృందం లడ్డు వేలం – దక్కించుకున్న ఎర్ర జంగయ్య

వెల్దండ: మండలంలోని చల్లపల్లి గ్రామంలో చిన్నారుల బాల వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన గణేశుడి లడ్డూ వేలంపాట భక్తుల ఆనందోత్సాహాల మధ్య జరిగింది. వేలంపాటలో ఎర్ర జంగయ్య (మేస్త్రి) రూ.8,600కు లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణనాథుడి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.అనంతరం బాల భక్త బృందం సభ్యులు జంగయ్యను శాలువాతో ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలో వెల్దండ ఆటో యూనియన్ ఉపాధ్యక్షులు పకాడి అంజయ్య, వార్డు సభ్యులు పోలి అంజయ్య, పకాడి అయోధ్య…

అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో చిన్న లడ్డు వేలం.. దక్కించుకున్న మనోహర్

చల్లపల్లిలో చిన్న లడ్డు వేలం రూ.13,500లకు దక్కించుకున్న.. మనోహర్ వెల్దండ: మండలంలోని చల్లపల్లి గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన చిన్న లడ్డూ వేలంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. లడ్డూ కోసం భక్తుల మధ్య తీవ్ర పోటీ నెలకొనగా, చివరకు కొమ్ము మనోహర్ రూ.13,500లకు లడ్డూను దక్కించుకున్నారు.ఈ సందర్భంగా యూత్ సభ్యులు మనోహర్ దంపతులను శాలువాలతో సన్మానించి, గణనాథుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. లడ్డూ వేలం నిర్వహించిన తీరుపై మనోహర్ మాట్లాడుతూ గణపతి మహిమను…

నిరుపేద వైద్య విద్యార్థినికి అండగా నిలిచిన ట్రస్ట్ అధినేత ఉప్పల వెంకటేష్

. జ్ఞాన తెలంగాణ స్పాట్ న్యూస్ కథనానికి స్పందన వెల్దండ సెప్టెంబర్ 24: జ్ఞాన తెలంగాణ స్పాట్ న్యూస్ లో "వైద్యురాలు కావాలని కోరిక.. పేదరికం అడ్డంకి – ఆదుకునే చేతుల కోసం ఎదురు చూపులు" అనే శీర్షికకు బీఆర్ఎస్ నాయకులు జోగయ్య చొరవతో స్పందన లభించింది.ఇటీవల నీట్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి ఎంబీబీఎస్ సీటును సాధించిన వెల్దండ మండల కేంద్రానికి చెందిన గుద్దేటి శేఖర్ అలివేల దంపతుల కూతురు గుద్దేటి సరిత ఎంబీబీఎస్ సీటు సాధించింది…

రామగిరి గ్రామంలో సిలిండర్ పేలి.. వ్యక్తికి గాయాలు

కల్వకుర్తి: మండలంలోని రఘుపతిపేట పరిధి రామగిరి గ్రామంలో సిలిండర్ పేలడంతో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్న మిగతా వారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఒక్క ఎకరా కూడా ఎండనివ్వం – జూరాల ఆయుకట్ట సాగునీరుతో రైతులకు భరోసా

వనపర్తి /నాగర్ కర్నూల్: జూరాల ఆయకట్టుకు సాగునీటి సరఫరాపై వనపర్తి కలెక్టర్ కార్యాలయంలో మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నీటి లభ్యత, ఆయకట్టు అవసరాలపై చర్చించారు.అనంతరం ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. రైతులకు సకాలంలో సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని, ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా చూస్తామని తెలిపారు. నీటి లభ్యతను బట్టి వారాబందీ విధానంలో సాగునీరు అందిస్తామని, వచ్చే వేసవిలో తాగునీటి ఇబ్బందులు…