ఒక్క ఎకరా కూడా ఎండనివ్వం – జూరాల ఆయుకట్ట సాగునీరుతో రైతులకు భరోసా
- లగచర్లలో రైతన్నతో ఆత్మీయ సభ: సీఎం రేవంత్ రెడ్డి హాజరు..! - November 9, 2026
- పీఏసీస్ వైస్ చైర్మన్ శంకర్ నాయక్ కు ఘన సన్మానం..! - November 9, 2026
- ఇబ్బందిలేని ఇందిరమ్మ రాజ్య సాధనే ప్రజా పాలన లక్ష్యం.. సర్పంచ్ వెంకటయ్య - November 9, 2026

వనపర్తి /నాగర్ కర్నూల్: జూరాల ఆయకట్టుకు సాగునీటి సరఫరాపై వనపర్తి కలెక్టర్ కార్యాలయంలో మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నీటి లభ్యత, ఆయకట్టు అవసరాలపై చర్చించారు.అనంతరం ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. రైతులకు సకాలంలో సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని, ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా చూస్తామని తెలిపారు. నీటి లభ్యతను బట్టి వారాబందీ విధానంలో సాగునీరు అందిస్తామని, వచ్చే వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.
