Author: PAKADI RAMANJANEYULU

ఆమనగల్ లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

ఆమనగల్: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాడి తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటిచెప్పిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని శనివారం ఆమనగల్ ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక పోరాట యోధురాలిగా, ధిక్కార స్వరానికి ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మ మహిళాలోకానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు కలకొండ యాదగిరి మాదిగ, సరికొండ పుల్లన్న తదితరులు పాల్గొన్నారు.

ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం.. ఘనంగా 131 వ జయంతి వేడుకలు

వెల్దండ, సెప్టెంబర్ 26: వెల్దండ మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో రజక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రజక సంఘం అధ్యక్షుడు రేవల్లి రవి, ఉపాధ్యక్షుడు రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, డీసీసీ ఉపాధ్యక్షుడు భూపతిరెడ్డి, ఉప సర్పంచ్ శ్రీను ముదిరాజ్ తదితరులు పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు,…

వైయస్ షర్మిల కుమార్తె నిశ్చితార్థానికి..వంశీ చంద్ రెడ్డి దంపతులు

కల్వకుర్తి : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, అనిల్ కుమార్ దంపతుల కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి–డా. సోమాల రఘురామ్ రెడ్డి నిశ్చితార్థ వేడుకకు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే,సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్ రెడ్డి తన సతీమణి ఆశ్లేషతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కాబోయే వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.

పేద కుటుంబాలకు జూపల్లి భాస్కరరావు..ఫాస్ట్ ఫుడ్ మొబైల్ బండ్లు అందజేత

కల్వకుర్తి, సెప్టెంబర్ 26: కల్వకుర్తి మండలం వేపూర్ గ్రామానికి చెందిన లస్కర్ ఖాజాజీ, యాదగిరి మాధవి కుటుంబాలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఫాస్ట్‌ఫుడ్ మొబైల్ బండ్లను అందజేశారు. వెల్దండ మండల సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కర్‌రావు ఆర్థిక సహకారంతో ఒక్కొక్కరికి సుమారు రూ.50 వేల విలువైన మొబైల్ బండ్లను అందించారు.కల్వకుర్తి మాజీ ఎంపీపీ కొండూరు గోవర్ధన్ కృషితో ఈ కార్యక్రమం చేపట్టారు. గ్రామ సర్పంచ్ పెరుమాళ్ల నాగరాజు, గ్రామ ప్రజలు హన్మంతరావు, తిరుపతిరావు, పి. రాంచంద్రయ్య,…

భక్తితో నిమజ్జనం.. జాగ్రత్తగా గణేశుడికి వీడ్కోలు పలుకుదాం – రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్

వెల్దండ సెప్టెంబర్ 25 : వినాయక నవరాత్రి ఉత్సవాల అనంతరం గణనాథుడి నిమజ్జనాన్ని భక్తిశ్రద్ధలతో పాటు అప్రమత్తంగా నిర్వహించాలని టీజీఎఫ్‌సీ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. నిమజ్జనం సందర్భంగా ఎవరూ లోతైన నీటిలోకి వెళ్లవద్దని, పిల్లలను నీటి వద్దకు ఒంటరిగా పంపకూడదన్నారు. భారీ విగ్రహాల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. మద్యం సేవించి నిమజ్జనానికి రావద్దని, పోలీసు, అధికారుల సూచనలు తప్పక పాటించాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే అధికారుల…

ప్రజా పాలనకు జాతీయ స్థాయిలో గుర్తింపు.. ఎంపీ మల్లు రవి

నాగర్ కర్నూల్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డికి ప్రతిష్టాత్మక పురస్కారం లభించడం పట్ల తెలంగాణ రాష్ట్ర ఎంపీల ఫోరం కన్వీనర్‌, నాగర్‌కర్నూల్‌ ఎంపీ, తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ మల్లు రవి హర్షం వ్యక్తం చేశారు.కేరళలో ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించి ప్రజల గౌరవాన్ని పొందిన ఆర్య దాస్‌ మహమ్మద్‌ పేరుతో అందజేసిన ఈ పురస్కారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజాసేవకు లభించిన ప్రత్యేక గౌరవమని మల్లు రవి పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి, పేదల…

చలో జాజాల.. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాక

వంగూర్ సెప్టెంబర్ 25: అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలం జాజాల గ్రామ సర్పంచ్ జీలకర్ర కాశమ్మకు సంఘీభావం తెలిపేందుకు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ శనివారం పర్యటించనున్నారు. ఈనెల 26న శనివారం ఉదయం 9 గంటలకు వంగూరులో నిర్వహించే విలేకరుల సమావేశంలో పాల్గొన్న అనంతరం ‘చలో జాజాల’ కార్యక్రమంలో పాల్గొంటారు. సర్పంచ్ కాశమ్మకు మద్దతుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని బీఆర్ఎస్ మండల నాయకులు…

గణనాధుని ప్రత్యేక పూజలు పాల్గొన్న..టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

వెల్దండ సెప్టెంబర్ 25: వెల్దండ మండల కేంద్రంలోని చత్రపతి శివాజీ మహారాజ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మట్టి గణపతి ప్రత్యేక పూజా కార్యక్రమంలో శుక్రవారం ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణనాథుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం వినాయక భక్త బృందం యూత్ సభ్యులు, పాత్రికేయులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డిని శాలువాలతో ఘనంగా సత్కరించి సన్మానించారు.ఈ కార్యక్రమంలో,ప్రజాప్రతినిధులు,తంబాలు యాదవ్,శివాజీ మహారాజ్ యూత్…

అజిలాపూర్ గ్రామంలో పర్యటించిన టాస్క్ సిఓఓ సంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

వెల్దండ సెప్టెంబర్ 25: వెల్దండ మండలం అజిలాపూర్ గ్రామాన్ని సందర్శించిన ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి‌ శుక్రవారం పర్యటించారు.గ్రామస్తుల కోరిక మేరకు గ్రామంలోని హనుమాన్ దేవాలయాన్ని సందర్శించారు.దేవాలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు సల్వాది అంజయ్య,మాజీ సర్పంచ్ సల్వాది జంగయ్య,వార్డు సబ్యులు కేశమోని నిర్మల సైదులు,మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు పల్స మల్లయ్య,గ్రామ సీనియర్…

వైద్య సీటు సాధించినా పేదరికమే అడ్డు – 1 లక్షతో అండగా నిలిచిన సింగిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి

వెల్దండ: పేదరికం అడ్డొచ్చినా పట్టుదలతో నీట్‌లో అర్హత సాధించి వైద్య సీటు పొందిన నిరుపేద విద్యార్థిని సరితకు టాస్క్‌ సీఓఓ, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి ఆర్థిక అండగా నిలిచారు.వెల్దండ మండల కేంద్రానికి చెందిన గుద్దేటి శేఖర్‌–అలివేలు దంపతుల కుమార్తె సరిత ఇటీవల నీట్‌ పరీక్షలో అర్హత సాధించి మహబూబాబాద్‌ వైద్య కళాశాలలో సీటు పొందారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్య విద్య కొనసాగించడం కష్టంగా మారిన విషయం పత్రికల ద్వారా తెలుసుకున్న…