Author: PAKADI RAMANJANEYULU

గణేష్ నిమజ్జన ఉత్సవాల్లో పాల్గొన్న సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్

గణేశ్ నిమజ్జన వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ వెల్దండ: మండల కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద సర్పంచ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యుల విజ్ఞప్తి మేరకు శ్రీ సీతారామస్వామి దేవాలయ నిర్మాణానికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.అనంతరం శ్రీ సాయినగర్ కాలనీలో నిర్వహించిన అన్నప్రసాద వితరణలో పాల్గొన్నారు. శ్రీరామ గణేశ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, ఆటపాటల కార్యక్రమాల్లో పాల్గొని, సన్మానం…

చల్లపల్లి గణేశుడు లడ్డుకి భారీ డిమాండ్ రూ. 39500 లకు సొంతం చేసుకున్న.. కృష్ణయ్య

వెల్దండ:మండలంలోని బొల్లంపల్లి గ్రామపంచాయతీ పరిధి చల్లపల్లిలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో గణేశ్ నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.భక్తులు, యువకులు ఉత్సాహంగా పాల్గొని గణనాథుడికి వీడ్కోలు పలికారు.ఈ సందర్భంగా నిర్వహించిన లడ్డు వేలంపాటలో పెద్ద లడ్డూను పకాడి కృష్ణయ్య రూ.39,500కు,మరో లడ్డూను కొమ్ము మనోహర్ రూ.13,500కు, బాల గణేష్ భక్త బృందం లడ్డూను ఎర్ర జంగయ్య రూ.8600,చిన్న లడ్డూను పకాడి గోవర్ధన్ రూ.7,500కు దక్కించుకున్నారు. అనంతరం లడ్డు గ్రహీతలను యూత్ సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో యువకులు, ప్రజాప్రతినిధులు,…

విషాదం.. ఆర్యన్ మృతదేహం లభ్యం

విషాదం.. ఆర్యన్ మృతదేహం లభ్యంకొట్ర శివారులో అదృశ్యమైన బీహార్‌కు చెందిన ఆర్యన్ కుమార్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కల్వకుర్తికి చెందిన అమితేష్‌ పొలంలోని గుంతలో మృతదేహం లభ్యమైనట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జూరాలకు కృష్ణమ్మ జలాలు.. రైతులకు కాంగ్రెస్ భరోసా – కాయితి విజయ్ కుమార్ రెడ్డి

కల్వకుర్తి: కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాల నుంచి జూరాల ప్రాజెక్టుకు వారాబందీ విధానంలో నీటిని విడుదల చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం అంగీకరించడం పట్ల కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాయితి విజయ్‌కుమార్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో పాలమూరు రైతులకు సాగునీటి భరోసా కలుగుతుందని తెలిపారు.రైతుల పంటలు ఎండిపోకుండా తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కర్ణాటక ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి తదితరులు కర్ణాటక…

విద్యుత్ సమస్యను పరిష్కరించాలని ఏపీకి సర్పంచ్ వినతిపత్రం అందజేత

వెల్దండ: అజిలాపూర్ గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ సిద్ధగోని రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం వెల్దండ విద్యుత్ శాఖ ఏఈని కలిసి వినతిపత్రం అందజేశారు.గ్రామానికి రెండు 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు, 20 విద్యుత్ స్తంభాలు మంజూరు చేయాలని కోరారు. అలాగే గ్రామంలో నిరంతరం విద్యుత్ దీపాలు వెలిగే సమస్యను నివారించేందుకు థర్డ్ వైరు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మాడుగుల మండలం ఇరువై గ్రామపంచాయతీ, వెల్దండ మండలం బైరాపూర్ నుంచి…

నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ గోపాల్ రెడ్డికి ఘన సన్మానం

అచ్చంపేట: అచ్చంపేట నియోజకవర్గం నూతన మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అడాపల గోపాల్ రెడ్డిని పలువురు నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.రైతులకు అండదండగా ఉంటూ వారి సంక్షేమం కోసం బాధ్యతాయుతంగా పనిచేసి, మార్కెట్ అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆదేశాల మేరకు నూతన చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అడపాల గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, రైతుల మేలు కోసం తన వంతు కృషి చేస్తానని…

గ్రామ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ

గ్రామాభివృద్ధి ప్రణాళికలపై శిక్షణనాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 24: గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల (వీజీపీపీ) తయారీపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వి.బి.-జి. రామ్‌జి సిబ్బందికి సెప్టెంబర్‌ 24, 25 తేదీల్లో నాగర్‌కర్నూల్‌ ఐడీఓసీ భవనంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శిక్షణ నిర్వహిస్తున్నారు.గ్రామాల అభివృద్ధికి అవసరమైన పనుల గుర్తింపు, మౌలిక వసతుల అంచనా, అభివృద్ధి లోటుపాట్ల విశ్లేషణ, వివిధ శాఖల సమన్వయం తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు. నీటి భద్రత, మొక్కల పెంపకం, సహజ వనరుల అభివృద్ధి, కరువు నివారణ,…

ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి అదన కలెక్టర్ – బి చెన్నయ్య

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్‌ 23: జిల్లాలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ బి.చెన్నయ్య సూచించారు. బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు 96,911 మంది ఓటర్లకు హియరింగ్‌ పూర్తయిందని, మరో 18,700 మంది నోటీసులు అందుకున్న ఓటర్లు హియరింగ్‌కు హాజరు కావాల్సి ఉందని తెలిపారు. నోటీసులు అందుకున్న ఓటర్లు అవసరమైన పత్రాలతో హాజరయ్యేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరారు.అలాగేమహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్‌ పట్టభద్రుల…

మృతురాలి కుటుంబానికి సర్పంచ్ కొండల్ యాదవ్ ఆర్థిక సాయం

వెల్దండ: మండలంలోని పోతేపల్లి గ్రామానికి చెందిన ఎనుముల చంద్రమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్‌ తగుళ్ల కొండల్‌ యాదవ్‌ స్పందించి బీఆర్‌ఎస్‌ నాయకుల ద్వారా మృతురాలి కుటుంబానికి రూ.3,000 ఆర్థిక సాయం అందించారు.ఈ సందర్భంగా కొండల్‌ యాదవ్‌ మాట్లాడుతూ ఆపదలో ఉన్న ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో కృష్ణయ్య, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.

గణనాథుల సన్నిధిలో సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ప్రత్యేక పూజలు

గణనాధుల సన్నిధిలో ప్రత్యేక పూజలో పాల్గొన్న సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్వెల్దండ: మండల కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీలో సూద అలివేల వెంకటయ్య దంపతులు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో సర్పంచ్ పాల్గొని అన్నప్రసాద వితరణ చేశారు. అనంతరం గ్రామంలోని పలు వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు, పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.