అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో చిన్న లడ్డు వేలం.. దక్కించుకున్న మనోహర్

చల్లపల్లిలో చిన్న లడ్డు వేలం రూ.13,500లకు దక్కించుకున్న.. మనోహర్

వెల్దండ: మండలంలోని చల్లపల్లి గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన చిన్న లడ్డూ వేలంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. లడ్డూ కోసం భక్తుల మధ్య తీవ్ర పోటీ నెలకొనగా, చివరకు కొమ్ము మనోహర్ రూ.13,500లకు లడ్డూను దక్కించుకున్నారు.ఈ సందర్భంగా యూత్ సభ్యులు మనోహర్ దంపతులను శాలువాలతో సన్మానించి, గణనాథుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. లడ్డూ వేలం నిర్వహించిన తీరుపై మనోహర్ మాట్లాడుతూ గణపతి మహిమను వివరించారు.కార్యక్రమంలో నాయకులు రాజేష్‌కుమార్‌రెడ్డి, వార్డు సభ్యులు వెంకటయ్య, అంజయ్య, యూత్ సభ్యులు గోవర్ధన్, పోలె రవి, రాజ్‌కుమార్, శివకుమార్, శ్రీశైలం, మహేష్, రమేష్, నరేష్, నవీన్, దినేష్, చందు, నందు, రాజేష్, వంశీ, మధు, వినయ్, బబ్లు,చిన్ను, గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.1001208755.jpg

You may also like...