గట్టమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రులు సీతక్క, కొండ సురేఖ.
- మరికొద్ది క్షణాల్లో టంగుటూరుకు మందకృష్ణ మాదిగ - October 15, 2026
- దేవుల నాయక్కు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడి జన్మదిన శుభాకాంక్షలు - October 12, 2026
- పెళ్లి హామీతో లైంగిక వేధింపుల ఆరోపణ.. డీఐ బాలస్వామి అరెస్ట్! - October 11, 2026

గట్టమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రులు సీతక్క, కొండ సురేఖ.
ములుగు జిల్లా సమీపంలో ఉన్న గట్టమ్మ తల్లిని బుధవారం రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ రాష్ట్ర పంచాయతీ రాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క దర్శించుకు న్నారు.ములుగు జిల్లాకు మొదటిసారిగా వచ్చిన మంత్రి సురేఖకు పంచాయతీ రాజ్ గ్రామీణ అభి వృద్ధి సంస్థ & మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్వాగతం పలికారు.
మేడారం మహా జాతరలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని తల్లిని కోరుకున్నారు. మొదటి సారి మంత్రి హోదాలో ములుగు జిల్లాకు రావడం గట్టమ్మ తల్లిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని మంత్రి కొండా సురేఖ అన్నారు.వారితో పాటు జిల్లా ఎస్పి శబరిష్, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ ఆర్డిఓ సత్య పాల్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
